బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్
- May 22, 2023
మచిలీపట్నం: మచిలీపట్నంలో బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం మొదలుపెట్టారు. ముందుగా తపసిపూడిలో సముద్రుడికి హారతి ఇచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. గంగమ్మతల్లికి చీర, సారెతో పాటు పసుపు కుంకుమను సమర్పించారు. బ్రేక్ వాటర్ పనుల్లో భాగంగా 99 లారీల్లో తీసుకొచ్చిన కొండ రాళ్ళతో డంపింగ్ చేశారు. దీంతో తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బందరు పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. శంకుస్థాపన జరిగినే రోజే బందరు పోర్టు పనులు మొదలయ్యాయి. ఆపై జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం వెళ్లనున్నారు.

తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







