'ది కేరళ స్టోరీ' వర్సెస్ బాలీవుడ్.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..

- May 22, 2023 , by Maagulf
\'ది కేరళ స్టోరీ\' వర్సెస్ బాలీవుడ్.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..

హైదరాబాద్: కేరళలో కొంత మంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో, రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాము అని చెప్తూ తీసిన సినిమా ది కేరళ స్టోరీ. అదా శర్మ, సిద్ది ఇదాని, యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించగా సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు. మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేయగా కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. కానీ ది కేరళ స్టోరీ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించి ఇప్పటికే 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇటీవల బాలీవుడ్ సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడానికి కష్టపడుతున్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలు, కొన్ని బాలీవుడ్ చిన్న సినిమాలు మాత్రం భారీ విజయాలు సాధిస్తూ కోట్లలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. చిన్న సినిమాలు కూడా కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టడంతో బాలీవుడ్ స్టార్స్ తేరుకోలేకపోతున్నారు. ఇక వీటిపై గత కొంతకాలంగా పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దర్శకుడు ఆర్జీవీ కూడా బాలీవుడ్ ని విమర్శిస్తూ అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తున్నాడు.

గతంలో కశ్మీర్ ఫైల్స్ సినిమా, సౌత్ సినిమాలు సక్సెస్ సాధించినప్పుడు కూడా వాటి నుంచి చూసి నేర్చుకోండి అంటూ ఆర్జీవీ పలు ట్వీట్స్ చేశాడు. తాజాగా ది కేరళ స్టోరీ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఆర్జీవీ బాలీవుడ్ పై వరుస ట్వీట్స్ చేశాడు.

ఆర్జీవీ తన ట్వీట్స్ లో.. మనకు, ఇతరులకు మనం అబద్ధాలు చెప్పుకోవడంలో ఎంత హాయిగా ఉంటామో, మనకు ఎవరైనా నిజం చూపిస్తే షాక్ అవుతాం. ఇప్పుడు ది కేరళ స్టోరీ సక్సెస్ పై బాలీవుడ్ అలాగే సైలెంట్ గా ఉంది. ది కేరళ స్టోరీ సినిమా బాలీవుడ్ అగ్లీనెస్ ని చూపించే ఓ అందమైన దయ్యం లాంటిది. ఇప్పుడు బాలీవుడ్ ప్రతి స్టోరీ డిస్కషన్ రూమ్ లో ది కేరళ స్టోరీ సినిమా వాళ్ళను వెంటాడుతుంది. ది కేరళ స్టోరీ సినిమాను చూసి బాలీవుడ్ నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే అబద్దాన్ని ఎవరైనా ఈజీగా కాపీ చేయొచ్చు, కానీ నిజాన్ని కాపీ చేయడం కష్టం అని రాశారు. దీంతో ఆర్జీవీ ది కేరళ స్టోరీ సినిమాను పొగుడుతూ చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com