పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
- May 22, 2023
అమరావతి: సిఎం జగన్ మచిలీపట్నం సభలో సభలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తో తనకు చివరి మీటింగ్ అంటూ మాట్లాడారు. మరోసారి జగన్ తో వేదికను పంచుకునే అవకాశం వస్తుందో రాదో అని వ్యాఖ్యానించారు, పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతున్నానని వేదిక పైనే నాని ప్రకటించారు.
రూ.5,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బందర్ పోర్ట్ పనులకు సీఎం జగన్ 2023 మే 22 సోమవారం రోజున శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న పేర్ని నాని ఈ కామెంట్స్ చేశారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బౌలశౌరి తదితర ప్రముఖులు మాట్లాడారు. అయితే దాదాపు ముప్పావు గంట పాటు మాట్లాడిన నాని తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే తనకు జగన్‌తో ఇదే చివరి మీటింగ్ కావచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లోపు వేదిక పై నుంచి ఎమ్మెల్సీ రఘురాం తో మరికొందరు ఇక చాలంటూ వెనుక నుంచి వారించారు. కానీ పేర్ని మాత్రం ఆపకుండా ప్రసంగాన్ని కొనసాగించాడు. ఆయన కొడుకును రాజకీయాల్లోకి దింపాలని పేర్ని నాని ఆలోచనలో ఉన్నారని అందుకే ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







