యూఏఈ లో పెరగనున్న ఉష్ణోగ్రతలు?
- May 23, 2023
యూఏఈ: దేశంలోని కొన్ని ప్రాంతాలలో పగటిపూట మాత్రమే పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అంచనా వేసింది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చునని, ఉష్ణప్రసరణ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని NCM ప్రతినిధి డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. ముఖ్యంగా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అయితే, ఇవేవి ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పును తీసుకురాలేవన్నారు. బుధవారం, దుబాయ్- అబుధాబితో సహా వివిధ ఎమిరేట్స్‌లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. NCM కొన్ని ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మరో వారం పాటు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







