రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు: సిపీ డి.ఎస్ చౌహాన్
- May 23, 2023
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సరఫరా, క్రయ, విక్రయాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల మీద రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలి విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నకిలీ విత్తనాల కట్టడిలో వ్యవసాయ అధికారులకు రాచకొండ పోలిస్ కమిషనరేట్ తరపున పూర్తీ సహకారం అందిస్తామని కమిషనర్ తెలిపారు.
నకిలీ విత్తనాలను అమ్మేవారిపైన పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు నకిలీ విత్తనాల అమ్మకం మరియు సరఫరా వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఐదేళ్ళలో 14 మంది మీద పిడి యాక్ట్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రజలు కూడా నకిలీ విత్తనాలు పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు. విత్తనాల ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం మరియు లోగో హోలోగ్రాం వంటి వాటిని బాగా పరిశీలించి మాత్రమే కొనాలని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని,వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు.
నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామని, వారు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన, ఎరువుల దుఖానాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం అడ్డుకోవడం కట్టడి చేయడం, వారు ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారు ప్రైమరీ కాంటాక్ట్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఫర్టీలైజర్ షాపులపైన ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాపును క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మితే వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ ఇంకా మరేమైనా విత్తనాలు కానీ ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వచ్చిన వారి వివరాలను ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాల గురించి ఎటువంటి ముందస్తు సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో యాదద్రి భోంగిరి, మల్కాజిగిరి- మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అగ్రికల్చర్ అధికారులు వారీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









