విజయవాడ నుంచి హజ్‌యాత్రకు ప్రత్యేక విమానాలు- డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా
- May 24, 2023
అమరావతి: జూన్ 7 నుంచి 19 వరకు విజయవాడ నుంచి హజ్‌యాత్రకు వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ సిఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ ఏడాది గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,813 మంది యాత్రికులను నేరుగా హజ్‌యాత్రకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజూ 155 మంది హజ్‌యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ ఎయిర్‌లైన్స్ రాష్ట్రం నుంచి యాత్రికులను హజ్‌కు తీసుకెళ్లి మరలా తిరిగి హజ్‌నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. గుంటూరు జిల్లా నంబూరు మదరసాలో వసతి కల్పన, ఎసి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టుకు యాత్రికులను చేర్చే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







