వాతావరణ మార్పులతో పెరుగుతున్న అలెర్జీ కేసులు..!

- May 25, 2023 , by Maagulf
వాతావరణ మార్పులతో పెరుగుతున్న అలెర్జీ కేసులు..!

యూఏఈ: యూఏఈ నివాసితులలో వాతావరణ మార్పులతో అలెర్జీ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు UAEలోని వైద్య నిపుణులు తెలిపారు. గత వారంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా దేశంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, క్లినిక్‌లలో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. గొంతు నొప్పి, ఉబ్బిన కళ్ళు వంటి లక్షణాలు సాధారణ అలెర్జీలని, వీటిని గమనించగానే  వైద్య నిపుణులను సంప్రదించాలని  సూచించారు. కాలానుగుణ మార్పులు దుమ్ము తదితర సమస్యలతో శ్వాసకోశ సమస్యలు సృష్టిస్తాయని తుంబే యూనివర్శిటీ హాస్పిటల్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ సైఫెల్డిన్ అబ్దేల్‌రాహ్మాన్ మొహమ్మద్ చెప్పారు. “సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు ఉష్ణోగ్రత మరియు తేమలో హెచ్చుతగ్గులతో తరచుగా వస్తాయి. ఈ వైరస్లు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు శ్వాసకోశ లక్షణాలు లేదా ఫ్లూతో బాధపడుతున్నారు.’’ అని పేర్కొన్నారు.   “కళ్లు ఎర్రబడడం, చర్మంపై దద్దుర్లు, ముక్కు కారడం, ఆస్తమా రూపంలో పిల్లలలో అలెర్జీ వ్యాధులకు సంబంధించిన కేసులు గత కొన్ని వారాలుగా పెరిగాయి.”అని అల్ ఐన్‌లోని బుర్జీల్ ఫర్హా హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ డాక్టర్ మోస్తఫా మాగేద్ హాటెమ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com