ఇండియన్ సైన్స్ ఫోరమ్‌లో విద్యార్థుల అద్భుత ప్రతిభ
- May 25, 2023
మస్కట్: ఇండియన్ సైన్స్ ఫోరమ్ వార్షిక సైన్స్ ఫియస్టా 2023లో ఒమన్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న భారతీయ పాఠశాలల నుండి వందలాది మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. రోలింగ్ ట్రోఫీని ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా గెలుచుకుంది. ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో ‘‘ఇండియాస్ స్పేస్ జర్నీ: మూన్, మార్స్ అండ్ బియాండ్’’ అనే థీమ్ తో ఈ సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు.. జూనియర్లు, సీనియర్లకు డిబేట్‌లు, స్పాట్ ప్రాజెక్ట్‌లు, ఫోటోగ్రఫీ పోటీలు, డిజిటల్ సింపోజియం, సైన్స్ ఎగ్జిబిషన్ వంటి వివిధ పోటీలను నిర్వహించారు.
ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్‌లోని ఇండియన్ సైన్స్ ఫోరమ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.రెత్నకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రదర్శన అంచనాలకు మించి ఉందన్నారు. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్ ఇండియన్ సైన్స్ ఫోరమ్ రెండు రోజుల వార్షిక సైన్స్ ఫియస్టా ఒమన్‌లోని అద్భుతమైన విద్యార్థుల ప్రతిభను తెలియజేసిందన్నారు. అంతకుముందు ఒమన్ సుల్తానేట్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ మాట్లాడారు. నేషనల్ యూనివర్శిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఇన్నోవేషన్ సెంటర్‌లో జరిగిన విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.
ఇండియన్ సైన్స్ ఫోరమ్ తరపున, ఐఎస్‌ఎఫ్ ఎపిజె అబ్దుల్ కలాం అవార్డును ఇస్రో మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ మైల్‌స్వామి అన్నాదురైకి కోఆర్డినేటర్ డాక్టర్ జె.రెత్నకుమార్ అందజేశారు. చంద్రయాన్-1, మంగళయాన్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టులలో అతను పనిచేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ.. భవిష్యత్తులో విద్యార్థులు అనేక ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అలీ అల్ బిమానీ మాట్లాడుతూ.. “ఏ దేశమైనా పురోగతి, అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం. విజయవంతమైన ఆర్థిక వ్యవస్థకు సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ అనేది కీలకం.’’ అని పేర్కొన్నారు.
ఎడ్యుటెక్ వ్యవస్థాపకురాలు, సీఈఓ సుధా విశ్వనాథన్ ను ఇండియన్ సైన్స్ ఫోరమ్ తరపున డాక్టర్ జె రెత్నకుమార్ సత్కరించారు. ఆమె ప్రస్తుతం బిట్స్ పిలానీ, దుబాయ్ కోసం డాక్టర్ అన్నాదురైతో కలిసి మహాశాట్ అనే ప్రతిష్టాత్మక స్టూడెంట్స్ శాటిలైట్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







