ప్రపంచంలోనే రెండవ సంతోషకరమైన దేశంగా కువైట్..!
- May 25, 2023
కువైట్: 157 దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ తర్వాత కువైటీలు అత్యంత సంతోషకరమైన అరబ్ ప్రజలుగా.. ప్రపంచంలో రెండవ సంతోషకరమైన దేశంగా కువైట్ నిలిచిందని హాంకే వార్షిక మిసరీ ఇండెక్స్ (HAMI) తెలిపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, బ్యాంక్-లెండింగ్ రేట్ల మొత్తం, తలసరి వాస్తవ GDPలో వార్షిక శాతం మార్పుల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. ఇండెక్స్ ప్రకారం, కువైట్ 2022లో అన్ని రంగాలలో బలమైన పనితీరును సాధించింది. ఇండెక్స్ ప్రకారం టాప్ 10 'సంతోషకరమైన' దేశాలుగా స్విట్జర్లాండ్, కువైట్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మాల్టా నిలిచాయి. టాప్ 10 'దయనీయమైన' దేశాల జాబితాలో జింబాబ్వే, వెనిజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా మరియు టర్కీ ఉన్నాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







