కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన మెగా పవర్ స్టార్.!
- May 25, 2023
కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి, తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేసి నిర్మాతగా సక్సెస్ అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
అయితే, ‘ఆచార్య’ సినిమాతో నిర్మాతగా బాగా దెబ్బ తినేశాడు రామ్ చరణ్. తాజాగా యువీ క్రియేషన్స్ ఓనర్ అయిన విక్రమ్‌తో కలిసి ఓ కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నాడట రామ్ చరణ్.
అదే వి మెగా పిక్చర్స్. ఈ కొత్త బ్యానర్ ద్వారానే ఇకపై సినిమాలు నిర్మించబోతున్నాడట రామ్ చరణ్. ఓ వైపు హీరోగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు.
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా చెలామణీ అవుతూనే బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
వీటితో పాటూ, అంతర్జాతీయ వేదికలకూ హాజరవుతూ ఇండియన్ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







