విటమిన్ సప్లిమెంట్స్ వాడుతున్నారా.? జర జాగ్రత్త సుమా.!

- May 25, 2023 , by Maagulf
విటమిన్ సప్లిమెంట్స్ వాడుతున్నారా.? జర జాగ్రత్త సుమా.!

ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి విటమిన్ డెషిషియన్సీ వెంటాడుతోంది. బిజీ జీవితంలో టైమ్‌కి సరిగా తిండి లేక. అదీ పోషకాలు నిండిన ఫుడ్ అందక విటమిన్ డెషిషియన్సీతో బాధపడుతున్నారు.

ఆ క్రమంలోనే ఉన్నంతలో విటమిన్ సప్లిమెంట్స్‌ని వాడేస్తూ బండి నడిపించేస్తున్నారు చాలా మంది. అయితే, ఈ విటమిన్ సప్లిమెంట్స్‌ని అడ్డదిడ్డంగా వాడడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

హార్ట్ ప్రాబ్లమ్స్ వున్న వాళ్లు విటమిన్ సప్లిమెంట్స్ వాడడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అలాగే అధిక రక్తపోటు వున్నవాళ్లు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు అధికమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావచ్చునని హెచ్చరిస్తున్నారు. 

ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ కె సప్లిమెంట్స్ అతిగా తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ విటమిన్ సప్లిమెంట్స్ వైద్యుని సలహా లేకుండా తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం, లేదంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ప్రాణాంతక సమస్యలు తెచ్చుకోవల్సి వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com