విటమిన్ సప్లిమెంట్స్ వాడుతున్నారా.? జర జాగ్రత్త సుమా.!
- May 25, 2023ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి విటమిన్ డెషిషియన్సీ వెంటాడుతోంది. బిజీ జీవితంలో టైమ్‌కి సరిగా తిండి లేక. అదీ పోషకాలు నిండిన ఫుడ్ అందక విటమిన్ డెషిషియన్సీతో బాధపడుతున్నారు.
ఆ క్రమంలోనే ఉన్నంతలో విటమిన్ సప్లిమెంట్స్‌ని వాడేస్తూ బండి నడిపించేస్తున్నారు చాలా మంది. అయితే, ఈ విటమిన్ సప్లిమెంట్స్‌ని అడ్డదిడ్డంగా వాడడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
హార్ట్ ప్రాబ్లమ్స్ వున్న వాళ్లు విటమిన్ సప్లిమెంట్స్ వాడడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అలాగే అధిక రక్తపోటు వున్నవాళ్లు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు అధికమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావచ్చునని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ కె సప్లిమెంట్స్ అతిగా తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ విటమిన్ సప్లిమెంట్స్ వైద్యుని సలహా లేకుండా తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం, లేదంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ప్రాణాంతక సమస్యలు తెచ్చుకోవల్సి వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!