హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు

- May 25, 2023 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు

హైదరాబాద్: జనవరి 16, 2024 నుంచి GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి యూరోప్ మరింత చేరువ కానుంది. ప్రధాన యూరోపియన్, స్టార్ అలయన్స్ మెంబర్ ఎయిర్‌లైన్ అయిన లుఫ్తాన్సా హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు నాన్‌స్టాప్ డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు లుఫ్తాన్స తొలి డైరెక్ట్ ఫ్లైట్ 2024 జనవరి 16న వైడ్ బాడీ బోయింగ్ B787-9 డ్రీమ్‌లైనర్‌తో ప్రారంభం కానుంది. ఈ విమానంలో 26 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ మరియు 247 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. ప్రారంభ విమానం ఫ్రాంక్‌ఫర్ట్ నుండి 10:00AM (Local time) కి బయలుదేరి, 11:00PM (Local time)కి హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ విమానం హైదరాబాద్ నుండి 1:00AM (Local time) కి బయలుదేరి 6:10 AMకి ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకుంటుంది. ఎనిమిదిన్నర గంటల ప్రయాణ సమయం కలిగిన ఈ విమానం ఫ్రాంక్‌ఫర్ట్ - హైదరాబాద్ విమానాశ్రయాల మధ్య వారానికి మూడుసార్లు- ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు మంగళ, శుక్రవారాలు మరియు ఆదివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సోమ, బుధ, శనివారాల్లో హైదరాబాద్‌ నుంచి విమానం బయలుదేరుతుంది.

ఈ కొత్త రూట్ తెలంగాణ, సమీప పరివాహక ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులను యూరప్‌లోని అనేక నగరాలు, దేశాలు మరియు ప్రాంతాలతో కనెక్ట్ చేస్తుంది. ప్రపంచంలోని ప్రధాన విమానయాన కేంద్రంగా ఉన్న ఫ్రాంక్‌ఫర్ట్ ప్రయాణికులను USA మరియు కెనడాతో సహా ఉత్తర అమెరికాలోని బహుళ నగరాలకు కనెక్ట్ చేస్తుంది. అదనంగా, లుఫ్తాన్స ఫ్రాంక్‌ఫర్ట్ నుండి లాటిన్ అమెరికాలోని అనేక నగరాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. కాబట్టి మీ యాత్రను ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, మరపురాని జ్ఞాపకాల ప్రయాణాన్ని ప్రారంభించండి.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com