అన్ని జాతీయులకు ఉద్యోగాలు.. ఫేక్ న్యూస్‌పై పోలీసులు హెచ్చరికలు

- May 26, 2023 , by Maagulf
అన్ని జాతీయులకు ఉద్యోగాలు.. ఫేక్ న్యూస్‌పై పోలీసులు హెచ్చరికలు

యూఏఈ: అన్ని జాతీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఫేక్ న్యూస్‌పై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అజ్మాన్ పోలీస్ వివరణ ఇచ్చింది. అధికార యంత్రాంగం ప్రకారం.. పోలీసులు అన్ని దేశాల ప్రజలకు ఉపాధి అవకాశాలను తెరుస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. పుకార్లు అవాస్తవమని పోలీసులు ధృవీకరించారు.అటువంటి పుకార్లను వ్యాప్తి చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరిక జారీ చేశారు. వారు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు.. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అధికారిక మూలాల నుండి మాత్రమే వార్తలను పొందాలని, సమాచారం కోసం అనధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆధారపడవద్దని ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com