ఐపీఎల్ 2023: ముంబై పై గుజరాత్ విజయం..
- May 27, 2023
గుజరాత్: కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా హార్దిక్ సేన వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం(మే 28న) చెన్నై సూపర్ కింగ్స్‌తో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది.
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌలైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(61; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో దంచికొట్టగా తిలక్ వర్మ(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. మిగిలిన వారిలో కామెరూన్ గ్రీన్(30) పర్వాలేదనిపించగా, రోహిత్ శర్మ(8), నెహల్ వధేరా(4), టిమ్ డేవిడ్(2), విష్ణు వినోద్(2) విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ ఐదు వికెట్లు తీయగా రషీద్ ఖాన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు, జాషువా లిటిల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 233 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (129; 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) శతకంతో దంచికొట్టాడు. ఈ సీజన్‌లో గిల్‌కు ఇది మూడో శతకం కాగా.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడో సెంచరీ కావడం గమనార్హం. మిగిలిన వారిలో సాయి సుదర్శన్ (43), హార్దిక్ పాండ్య (28*) దూకుడుగా ఆడారు. ముంబయి బౌలర్లు ఆకాశ్ మధ్వాల్, పీయూశ్ చావ్లా చెరో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







