తెలంగాణ: మెడికల్ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు పై హర్షం
- May 28, 2023
హైదరాబాద్: తెలంగాణలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచి 15 శాతం మేర స్టైపెండ్‌ను పెంచుతున్నట్లు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పుల చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెంచారు. అలాగే సీనియర్ రెసిడెంట్లకు హానరోరియం కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు, సీనియర్ రెసిడెంట్లకు పెంచిన 15 శాతం స్టైపెండ్, హానరోరియమ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్వర్లుల్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గతంలోనే విద్యార్థులకు స్టైపెండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆర్థిక శాఖ అనుమతితో వైద్యారోగ్య శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లకు రూ.22,527 నుంచి రూ.25,906కు స్టైపెండ్ పెంచారు. ఇక పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు రూ.50,385 నుంచి రూ.58,289కి రెండో ఏడాది విద్యార్థులకు రూ.53,503 నుంచి రూ.61,528కి, మూడో ఏడాది విద్యార్థులకు రూ.56,319 నుంచి రూ.64,767కి పెంచారు.
పీజీ డిప్లోమా మొదటి ఏడాది విద్యార్థులకు రూ.50,686 నుంచి రూ.58,289కి, రెండో ఏడాది విద్యార్థులకు రూ.53,503 నుంచి రూ.61,528కి పెంచారు. సూపర్ స్పెషాలిటీ మొదటి ఏడాది విద్యార్థులకు రూ.80,500 నుంచి రూ.92,575కి, రెండో ఏడాది విద్యార్థులకు రూ.84,525 నుంచి రూ.97,525కి, మూడో ఏడాది విద్యార్థులకు రూ.88,547 నుంచి రూ.1,01,829కి పెంచారు. ఎండీఎస్ మొదటి ఏడాది విద్యార్థులకు రూ.50,686 నుంచి రూ.58,289కి, రెండో ఏడాది విద్యార్థులకు రూ.53,503 నుంచి రూ.61,528కి, మూడో ఏడాది విద్యార్థులకు రూ.56,319 నుంచి రూ.64,767కి పెంచారు. సీనియర్ రెసిండెట్స్ హానరోరియంను రూ.80,500 నుంచి 92,575కు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మెడికల్ విద్యార్థుల స్టైఫండ్ 15 శాతం పెంచడం పై జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ కౌశిక్,సలహాదారుడు డాక్టర్ రాజీవ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు శనివారం వారు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజీవ్,ప్రతినిధులు డాక్టర్ అఖిల్,డాక్టర్ కరిష్ని తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









