ఏడేళ్ళలో 70 శాతం పెరిగిన నీటి వినియోగం

- May 11, 2016 , by Maagulf
ఏడేళ్ళలో 70 శాతం పెరిగిన నీటి వినియోగం

ఏడేళ్ళలో కువైట్‌లో నీటి వినియోగం 70 శాతం పెరిగినట్లు ఖతార్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ఈ మేరకు వివరాలను విడుదల చేసింది. 2013లో 740 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు వినియోగం జరిగిందని, 2006లో ఇది కేవలం 437 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లుగా ఉందని ఆయన చెప్పారు. పారిశ్రామిక విబాగం 200 శాతానికి పైగా వినియోగం పెంచుకుందని గణాంకాలువ ఎల్లడిస్తున్నాయి. 2006లో 130 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి వినియోగం రెసిడెన్షియల్‌ హౌస్‌హోల్డ్స్‌ ద్వారా అయితే, అది 2013 నాటికి 245 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు ఉంది. 2006లో 967,000 మంది ప్రజలున్నారు. ఈ సంఖ్య 2013 నాటికి 2.1 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ఇది 2.5 మిలియన్లుగా ఉంది. జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా, ప్రజల వ్యక్తిగత అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నీటి లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com