వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- May 29, 2023
బహ్రెయిన్: ఓ మహిళను నిర్దాక్షిణ్యంగా వ్యభిచార రొంపిలోకి దింపినందుకు ఇద్దరు మహిళలకు 10 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు అప్పీళ్ల కోర్టు సమర్థించింది. కోర్టు నేరస్తులకు BD2000 జరిమానా కూడా విధించింది. కోర్టు పత్రాల ప్రకారం.. ఇద్దరు మహిళలు బలవంతం, బెదిరింపులు, ఒత్తిడిని ఉపయోగించి బాధితురాలిని వ్యభిచారం వృత్తిలోకి దింపారు. ఆరు రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. ఆ మహిళ సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధిత మహిళను రక్షించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులలో ఒకరు ఆమె బంధువు. మసాజ్ సేవలు అందించి డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి ఆమెను బహ్రెయిన్ తీసుకొచ్చారు. “నేను బహ్రెయిన్కు రాగానే, వాళ్లు ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికి ఓ అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అయితే, మరుసటి రోజు వారు నన్ను వ్యభిచారం చేయాలని డిమాండ్ చేస్తూ బెదిరించడం ప్రారంభించారు. కానీ నేను నిరాకరించాను. అప్పుడు వారు నా వీసా, ప్రయాణ ఖర్చుల కింద వెంటనే BD1,800 చెల్లించాలని డిమాండ్ చేశారు. నిస్సహాయంగా వాళ్ల ఒత్తిడి తలొగ్గాను. నా పరిస్థితిని రాయబార కార్యాలయానికి, పోలీసులకు తెలియజేయడానికి నాకు అవకాశం లభించే వరకు ఇది కొనసాగింది. ”అని బాధితురాలు ప్రాసిక్యూటర్లకు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు