ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- May 29, 2023
దోహా: ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF), భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆసియన్ టౌన్‌లో కార్మిక దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. "కార్మిక దినోత్సవం రంగ్ తరంగ్ 2023" పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం ఛార్జ్ డి'ఎఫైర్స్ ఏంజెలిన్ ప్రేమలత, అంతర్గత మంత్రిత్వ శాఖ (MOI) నుండి మొదటి లెఫ్టినెంట్ ఖలీద్ హుస్సేన్ అల్ షమారి, లెఫ్టినెంట్ కల్నల్ ఖలీద్ అల్ జమాన్, జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) నుండి హమద్ అల్ మర్జూకీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) నుండి మాక్స్ టునన్, శ్రీలంక రాయబారి మహమ్మద్ మఫాజ్ మొహిదీన్, బంగ్లాదేశ్ రాయబారి ఎండీ నజ్రుల్ ఇస్లాం, నేపాల్ రాయబారి మిస్టర్ నరేష్ బిక్రమ్ ధాకల్ హాజరయ్యారు. ICBF జనరల్ సెక్రటరీ వర్కీ బోబన్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, మనోహరమైన ఆర్కెస్ట్రా ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అబ్దుల్ రషీద్ నీలిమావుంగల్, హంజా సి, పీటర్ పియస్, కారియట్ పరంబిల్ అయ్యప్పన్, మాదవబట్ట్ సుధాకరన్, సయ్యద్ జాఫర్, వలియకత్ బషీర్, శశిదరన్ టెక్కైల్, అమూ మహ్మద్ షఫీలను పన్నెండు మంది అత్యుత్తమ బ్లూ కాలర్ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ICBF వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి, సెక్రటరీ మహమ్మద్ కున్హి, మేనేజింగ్ కమిటీ సభ్యులు జరీనా అహద్, శ్రీ హమీద్ రజా, శంకర్ గౌడ్, అబ్దుల్ రవూఫ్ కొండొట్టి, కుల్విందర్ సింగ్ హనీ, సలహా మండలి చైర్మన్ SAM బషీర్, అడ్వైజరీ బోర్డు సభ్యులు జాన్సన్ ఆంటోని, రామసెలవం పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)





తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







