రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- May 29, 2023ముంబాయి: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌బీఐ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో లీగల్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్రరీ ప్రొఫెషనల్ తదిర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆన్‌లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష జులై 23వ తేదీన ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్ సైట్ ;https://opportunities.rbi.org.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!