జూన్ 1 నుండి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం
- May 30, 2023
అమరావతి: ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. జూన్ 1 నుండి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం నుండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపేశారు. జూన్1 నుంచి అమల్లోకి పెరిగిన మార్కెట్ ధరలు రానున్నాయి. సర్వర్లు డౌన్ అవటంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు.
ఇటు అనంతపురం జిల్లాలో కిటకిట లాడుతున్నాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు. అనంతపురం జిల్లాలో రెండవ రోజు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి . నిన్న ఒక్క రోజు అర్భన్ పరిధిలో ఆగిపోయాయి 60 రిజిస్ట్రేషన్లు. సాంకేతిక సమస్యతో వెబ్ సైట్ తెరుచుకోలేదు. రివర్స్ ప్రింట్ రావడం లేదంటున్నారు అధికారులు. జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెరుగుతుండడంతో కావాలనే సర్వరు ప్రాబ్లం చెబుతున్నారని కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధరలు పెరిగే ప్రాంతాలు చూస్తే.. విశాఖ, గాజువాక, ద్వారకానగర్, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, మధురవాడ.
భూమి విలువ పెంపు ఇలా: డిమాండ్ ఉన్న చోట 60 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, తక్కువ ఉన్న చోట 30 శాతం మేర భూముల రేట్లు పెంచనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







