బహ్రెయిన్‌లో ఆహారం, నీటి భద్రతను మెరుగుపరచండి: HM కింగ్ హమద్

- May 30, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో ఆహారం, నీటి భద్రతను మెరుగుపరచండి: HM కింగ్ హమద్

బహ్రెయిన్‌: పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఆహారం. నీటి భద్రతను సాధించడంలో దోహదపడే ప్రణాళికలు, ప్రాజెక్టుల అభివృద్ధి,  అమలును వేగవంతం చేయాలని హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశించారు. అల్ సఖిర్ ప్యాలెస్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరైన వారపు కేబినెట్ సమావేశానికి హెచ్‌ఎం కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అధ్యక్షత వహించారు. ఆహార భద్రతను పెంపొందించే, ఆహార భద్రత దాని సుస్థిరతను నిర్ధారించడానికి జాతీయ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలను అనుసరించాలని HM కింగ్ హమద్ సూచించారు. ఆహార పరిశ్రమల రంగంలో జాతీయ సామర్థ్యాలను పెంపొందించడం, భవిష్యత్తు ఆహార, నీటి భద్రత అవసరాలకు ప్రతిస్పందించగల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com