జగన్ నాలుగేళ్ల పాలన పై స్పందించిన చంద్రబాబు నాయుడు
- May 30, 2023
అమరావతి: ఏపి సిఎం జగన్ నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు వేడుకలు జరుపుకుంటుండగా… విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. జగన్ సీఎం అయిన వెంటనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమావేశం సందర్భంగా జగన్ మాట్లాడుతూ… తొలి కూల్చివేత ఈ బిల్డింగ్ తో ప్రారంభమవుతుందని జగన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు షేర్ చేశారు. ‘నిజమే. తొలి రోజు మీరు ఏం చెప్పారో మీ ప్రభుత్వం దాన్నే తూచ తప్పకుండా అమలు చేస్తోంది. ఏపీ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమయింది… ఆ విధ్వంసం ఐదో ఏడాది కూడా కొనసాగుతోంది’ అని చంద్రబాబు అన్నారు. దీంతోపాటు ప్రజావేదికను కూల్చుతున్న వీడియోను కూడా షేర్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







