ఖర్జూర ఉత్పత్తిలో జీసీసీలో ఒమన్ కు రెండవ స్థానం
- May 31, 2023
మస్కట్: సుల్తానేట్‌లోని ఒకటి కంటే ఎక్కువ విలాయత్‌లలో ఖర్జూరాల సీజన్ ప్రారంభమైంది. సుల్తానేట్‌లో ఖర్జూర చెట్ల సంఖ్య 9 మిలియన్లకు పైగా ఉన్నదని, ఒమన్ సుల్తానేట్ ప్రస్తుతం ఖర్జూర ఉత్పత్తిలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉందని, ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో మరియు గల్ఫ్‌లో రెండవ స్థానంలో ఉందని వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖలో నిపుణుడు ఇంజనీర్ హైథమ్ బిన్ బదర్ అల్-ఖంజరి తెలిపారు. 62,000 ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర పంట విస్తరించి ఉందని, ఒక తాటికి ప్రపంచ సగటు 40 కేజీలతో పోలిస్తే..51 కిలోల ఉత్పాదకతో ఒమన్ ముందు వరుసలో ఉందన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఖర్జూరం 2021లో 374,000 టన్నులకు చేరుకుందని, వినియోగానికి 53% పోగా 4% తయారీకి.. 4% ఎగుమతికి.. మిగిలినవి పశుగ్రాసంగా ఉపయోగించబడ్డాయన్నారు. 2021 గణాంకాల ప్రకారం.. 26,817 టన్నుల ఉత్పత్తితో ఒమన్ సుల్తానేట్‌లో ఇబ్రి విలాయత్ అత్యంత ఉత్పాదక రాష్ట్రంగా నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







