భూమికి తిరుగు ప్రయాణమైన సౌదీ వ్యోమగాములు
- May 31, 2023
రియాద్ : సౌదీ వ్యోమగాములు రేయానా బర్నావి, అలీ అల్ ఖర్నీ మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తమ 10-రోజుల చారిత్రక మిషన్‌ను ముగించారు. భూమికి తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మేరకు సౌదీ స్పేస్ కమిషన్ (SSC) ట్విటర్‌లో ఒక వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ రిటర్న్ జర్నీని ప్రారంభించిందని, ఇది నీటిని చేరుకోవడానికి 12 గంటల ముందు పడుతుందని పేర్కొంది.
NASA, SpaceX, Axiom స్పేస్ వ్యోమగాముల రాకను వారి వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. నాసా ప్రసారం.. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. వాతావరణంతో సహా అన్ని పరిస్థితులు అన్‌డాకింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని యాక్సియోమ్ తెలిపింది. AX-2 సిబ్బంది తమ మిషన్ ముగిసే సమయానికి అంతరిక్షంలో దాదాపు 10 రోజులు పూర్తి చేస్తారని పేర్కొంది.
కక్ష్యలో ఉన్న ప్రయోగశాలలో ఉన్న సమయంలో, AX-2 వ్యోమగాములు 20కి పైగా STEAM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ మరియు మ్యాథమెటిక్స్) ఔట్‌రీచ్ ఎంగేజ్‌మెంట్‌లు, మైక్రోగ్రావిటీలో 20 కంటే ఎక్కువ పరిశోధన అధ్యయనాలు, అలాగే ఎనిమిది మీడియా ఈవెంట్‌లను విజయవంతంగా పూర్తి చేశారు. ఆక్సియోమ్ స్పేస్ ప్రారంభించిన ప్రైవేట్ AX-2 మిషన్‌లో భాగంగా మే 22న బర్నావి, అల్ ఖర్నీ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







