"డూయింగ్ బిజినెస్ ఇన్ కువైట్" అంశంపై ఇండియన్ ఎంబసీ సెమినార్
- June 01, 2023
కువైట్: ఎంబసీ ఆడిటోరియంలో మే30న హైబ్రిడ్ ఫార్మాట్‌లో “డూయింగ్ బిజినెస్ ఇన్ కువైట్” పేరుతో భారతీయ కంపెనీల కోసం ఎంబసీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెమినార్‌ను నిర్వహించింది. CII సభ్యులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. సెమినార్ సందర్భంగా.. నిపుణులైన కన్సల్టెంట్లు కువైట్‌లో వ్యాపారం చేయడానికి రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్, స్పాన్సర్‌షిప్, టాక్సేషన్ మరియు ఇతర చట్టపరమైన విషయాల గురించి వివరించారు. కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సెమినార్‌లో ప్రసంగిస్తూ.. విజన్ 2035 కింద విజన్ 2035 కింద విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నందున గల్ఫ్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ మరియు పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో తమ వ్యాపారాలను విస్తరించేందుకు కువైట్‌ను సంభావ్య గమ్యస్థానంగా చూడాలని భారతీయ కంపెనీలను కోరారు. భారతదేశం, కువైట్ నుండి 200 మంది వరకు ప్రముఖులు ఈ సెమినార్‌లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







