అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఇండియా,కువైట్
- June 02, 2023
కువైట్: భారతదేశం, కువైట్ మధ్య ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై సంప్రదింపులు కువైట్ నగరంలో జరిగాయి. కువైట్ తరఫున అంతర్జాతీయ సంస్థల సహాయ మంత్రి అబ్దుల్ అజీజ్ సౌద్ మహ్మద్ అల్-జరల్లా చర్చలకు నాయకత్వం వహించగా.. భారత ప్రతినిధి బృందానికి యూఎన్ పొలిటికల్ జాయింట్ సెక్రటరీ ప్రకాష్ గుప్తా, కువైట్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా నాయకత్వం వహించారు. రెండు దేశాల మధ్య ఈ తరహా సంప్రదింపులు ఇదే మొదటిది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సహా ఇతర అంతర్జాతీయ సంస్థలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. నామ్(NAM), G-77 ఫ్రేమ్‌వర్క్‌లో సహకారంతో సహా బహుపాక్షిక వేదికలపై పరస్పర ఆసక్తి ఉన్న రంగాలపై ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







