జిలీబ్ అల్-షుయౌఖ్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు మృతి
- June 03, 2023
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) ఒక ప్రకటనలో తెలిపింది. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణంగా తెలిపింది. అలాగే ప్రమాదం జరిగి సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఇంటిలోకి ప్రవేశించకుండా తలుపులు, ఇనుప కడ్డీలు వంటీ స్క్రాప్ లు ఉన్నాయని, దాంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇంటి యజమానులు తమ భవనాల భద్రతను నిర్ధారించుకోవాలని, అగ్నిమాపక సిబ్బందికి ఆటంకం కలిగించే స్క్రాప్లను నిల్వ చేయకుండా అద్దెదారులను నిరోధించాలని కువైట్ ఫైర్ ఫోర్స్ సూచించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







