యూఏఈ ఎమిరేట్‌లలో వేగ పరిమితుల్లో కీలక మార్పులు

- June 03, 2023 , by Maagulf
యూఏఈ ఎమిరేట్‌లలో వేగ పరిమితుల్లో కీలక మార్పులు

యూఏఈ: దుబాయ్, అబుధాబి, ఇతర ఎమిరేట్‌లలో వేగ పరిమితుల్లో 6 కీలక మార్పులు చేశారు.  రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ నిబంధనలను క్రమం తప్పకుండా అంచనా వేయడంతో దేశవ్యాప్తంగా అధికారులు అవసరమైన వేగ పరిమితి మార్పులను అమలు చేస్తారు. గత కొన్ని నెలలుగా అబుదాబి నుండి దుబాయ్, షార్జా , అజ్మాన్ వరకు కనీసం ఆరు ప్రధాన సవరణలను చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులకు 300 దిర్హామ్‌ల నుండి 3,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధించబడుతుంది.

1. స్వీహాన్ రోడ్, అబుధాబి

జూన్ 4 నుండి ఈ రహదారిపై వేగ పరిమితి — అల్ ఫలాహ్ వంతెన నుండి అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వైపు — 120 కి.మీ.గా నిర్ణయించారు. గతంలో ఇది గంటకు 140 కి.మీ..

2. షేక్ మహమ్మద్ బిన్ రషీద్ రోడ్, అబుధాబి

ఏప్రిల్ నుండి అబుధాబి అధికారులు ఈ ప్రధాన రహదారిపై 120 కి.మీ. కనీస వేగాన్ని అమలు చేస్తున్నారు. మే 1 నుండిఉల్లంఘించిన వారికి 400 Dh400 జరిమానా విధించబడింది. గరిష్ట వేగం 140 కి.మీ..,అయితే డ్రైవర్లు ఎడమ నుండి మొదటి, రెండవ లేన్‌లలో ఉంటే, కొత్త పెనాల్టీని నివారించడానికి వారు 120 కి.మీ. వేగంతో నడపవలసి ఉంటుంది. కనీస వేగం పేర్కొనబడని మూడవ లేన్‌లో నెమ్మదైన వాహనాలను అనుమతి ఇస్తారు.

3. దుబాయ్-హట్టా రోడ్

జనవరిలో రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్-హట్టా రోడ్‌లో వేగ పరిమితిని 100kmph నుండి 80kmph కు తగ్గించింది. ఇది దుబాయ్, అజ్మాన్,  అల్ హోస్న్ రౌండ్‌అబౌట్‌లో విస్తరించి ఉన్న 6 కి.మీ. ప్రధాన రహదారి.

 

4. మస్ఫౌట్, ముజైరా ప్రాంతాలు, అజ్మాన్

దుబాయ్ ప్రకటన వెలువడిన వెంటనే అజ్మాన్ పోలీసులు ఎమిరేట్‌లోని మాస్‌ఫౌట్, ముజైరా ప్రాంతాల్లో ఉన్న హట్టా వీధిలో వేగ పరిమితిని నిర్దేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిమితి 100kmph నుండి 80kmphకి మార్చారు. 

5. అబుధాబి-అల్ ఐన్ రోడ్

అబుధాబి పోలీసులు ఈ రహదారిపై వేగ పరిమితిని 160kmph నుండి 140kmphకు తగ్గించారు. ఇది ఇప్పుడు అల్ ఐన్ సిటీ దిశలో అల్ సద్ బ్రిడ్జ్ నుండి అల్ అమెరా బ్రిడ్జ్ వరకు వర్తిస్తుంది. యుఎఇ రాజధానిలో స్పీడ్ బఫర్‌లు లేవని గుర్తుంచుకోవాలి.

6. వాడి మాదిక్ - కల్బా రోడ్డు

ఈ విశాలమైన రహదారి చుట్టూ నివాస ప్రాంతాలు లేదా పట్టణ కేంద్రాలు లేనందున రవాణా అధికారులు వేగ పరిమితిని 80kmph నుండి 100kmph కు పెంచాలని నిర్ణయించారు. E102 అని కూడా పిలువబడే ఈ రహదారి, ఫుజైరా సరిహద్దు నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడి మాదిక్‌ను కల్బాకు కలుపుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com