ఇసా స్పోర్ట్స్ సిటీలో బహ్రెయిన్ బేబీ గేమ్స్ 2023 ప్రారంభం
- June 03, 2023
బహ్రెయిన్: ఇసా స్పోర్ట్స్ సిటీలో బహ్రెయిన్ బేబీ గేమ్స్ 2023 ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల ఈవెంట్లో తొలిరోజు నిర్వహించిన పసిబిడ్డల గేమ్స్ ఆకట్టుకున్నాయి. బహ్రెయిన్ బేబీ గేమ్స్ మూడవ ఎడిషన్ యూత్ అండ్ స్పోర్ట్స్ సుప్రీం కౌన్సిల్ (SCYS), జనరల్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ (GSA), బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (BOC) అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. చిన్నారులు తమ ప్రతిభను కనబరిచారు.
గేమ్‌ల మూడవ ఎడిషన్‌లో బహ్రెయిన్‌లోని 30 కంటే ఎక్కువ కిండర్ గార్టెన్లు, ప్రాథమిక పాఠశాలల నుండి 600 మంది పిల్లలు పాల్గొంటున్నారు. 12 నెలల పిల్లలకు క్రాల్ చేయడం, 15 నెలల లోపు పిల్లల కోసం వాకింగ్ వంటి వివిధ విభాగాలలో పోటీ పడ్డారు. 2018, 2019లో వరుసగా రెండు బేబీ ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, అక్టోబర్‌లో జరిగే నాలుగో ఎడిషన్‌ను ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. రాబోయే ఈవెంట్ మిడిల్, హైస్కూల్ పిల్లలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో GSA డిప్యూటీ చైర్మన్ హెచ్‌హెచ్ షేక్ సల్మాన్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (BFA) డిప్యూటీ చైర్మన్ HH షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా, క్యాబినెట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మరియు BOC డిప్యూటీ ప్రెసిడెంట్ HH షేక్ ఇసా బిన్ అలీ బిన్ ఖలీఫా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







