బ్రహ్మానందం చేతుల మీదుగా అన్ స్టాపబుల్ ట్రయిలర్ లాంచ్
- June 04, 2023హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అన్ స్టాపబుల్. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. ఈ ట్రయిలర్ రిలీజ్ వేడుకకు హాస్యనటులు బ్రహ్మానందం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్ అయింది. విజె సన్నీ, సప్తగిరి మంచి స్నేహితులు, వారికి డబ్బు అవసరం. మరోవైపు మిస్సయిన డ్రగ్స్ ప్యాకెట్స్ కోసం విలన్ అన్వేషణలో ఉంటాడు. సన్నీ, సప్తగిరి 100 కోట్ల విలువైన డ్రగ్స్ ని కనుగొంటారు. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోలు, ఆ సింగిల్ విలన్ మధ్య ఏం నడిచింది, ఎంత కామెడీ పుట్టిందనే కోణంలో ట్రయిలర్ ను కట్ చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్