నిర్మాణ రంగంలో 152,500కి చేరుకున్న మహిళా ఉద్యోగుల సంఖ్య
- June 04, 2023రియాద్: నిర్మాణ రంగంలో సామాజిక బీమా నియమాలు, నిబంధనలకు లోబడి ఉన్న కార్మికుల సంఖ్య 2022 నాల్గవ త్రైమాసికం చివరి నాటికి దాదాపు 2.46 మిలియన్ల కార్మికులకు చేరుకుంది. అల్ ఈక్వతేసాదియా (Al-Eqtesadiah) ప్రకారం.. సామాజిక బీమా నిబంధనలకు లోబడి ఉన్న విదేశీ కార్మికులు.. ఈ రంగంలో అత్యధిక శాతం 85.4%(2.1 మిలియన్ల కార్మికులు) కలిగి ఉన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సౌదీలు 14.6%(369,600 మంది ఉద్యోగులు) మంది ఉన్నారు. అయితే ఈ రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 152,500 మంది ఉద్యోగులకు చేరుకుంది. వీరిలో అత్యధిక శాతం సౌదీ మహిళలు ఉన్నారని నివేదిక తెలిపింది. నిర్మాణ రంగంలో అత్యధిక శాతం కార్మికులు ఉన్న సౌదీ నగరాల విషయానికొస్తే రాజధాని రియాద్ అత్యధికంగా 39.6%(972,600 మంది ఉద్యోగులు) ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో తూర్పు ప్రాంతం (అల్-షార్కియా)లో 648,900 మంది కార్మికులు, మక్కాలో 444,700 మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు