అజ్మాన్‌ లో ఇంధన ట్యాంక్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతి

- June 05, 2023 , by Maagulf
అజ్మాన్‌ లో ఇంధన ట్యాంక్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతి

యూఏఈ: అజ్మాన్‌ లోని అల్ జుర్ఫ్ పారిశ్రామిక ప్రాంతంలో ఇంధన ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతులను ఆసియన్లుగా గుర్తించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పేలుడు సంభవించినట్లు తమకు సమాచారం అందిందని అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి వెల్లడించారు. కార్మికులు ట్యాంకుల్లో ఒకదానిపై వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి పేలుడుకు దారితీసింది. భద్రతా నిబంధనలను పాటించకపోవడం వల్లే పేలుడు సంభవించిందని అజ్మాన్ పోలీస్ చీఫ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com