బుక్ ఫెయిర్‌లో వ్యక్తిని అవమానించిన మహిళపై చట్టపరమైన చర్యలు

- June 06, 2023 , by Maagulf
బుక్ ఫెయిర్‌లో వ్యక్తిని అవమానించిన మహిళపై చట్టపరమైన చర్యలు

యూఏఈ: బుక్ ఫెయిర్‌లో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఒక వ్యక్తిపై మాటలతో అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబ్ మహిళపై అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. సదరు మహిళ ప్రజల అభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బుక్ ఫెయిర్‌లో పాల్గొనే వ్యక్తి గోప్యత హక్కుపై దాడి చేయడంతో అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. యూఏఈ  అన్ని వర్గాల వ్యక్తుల హక్కులకు హామీ ఇస్తుందని, ఇతరుల హక్కులపై ఎలాంటి పక్షపాతం లేదా ఉల్లంఘనను అంగీకరించదని అధికారులు స్పష్టం చేసారు. 2021 ఫెడరల్ డిక్రీ 34లోని ఆర్టికల్ 44 ప్రకారం, ఈ నేరానికి కనీసం 6 నెలల జైలు శిక్ష మరియు కనీసం Dh150,000.. గరిష్టంగా Dh500,000 జరిమానా విధించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com