'స్పార్క్ మీడియా' ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- June 06, 2023
దుబాయ్: దుబాయ్ లో స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తేది జూన్ 4న (ఆదివారం) రోజున దుబాయ్ లోని ఎతిసలాత్ అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ప్రవాసీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా యూఏఈ, భారత్ జాతీయ గీతాలను ఆలపించి వేడుకలను ప్రారంభించారు.
_1686036255.jpg )
అనంతరం స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా మాట్లాడుతూ.. తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ నిరధిని స్మరిస్తూ అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

TFCC చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. దుబాయిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడంపై అయన హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈసారి ఆగష్టు 12న దుబాయ్ లో నిర్వహించనున్నట్టు తెలియజేశారు.

MAA GULF News ఎడిటర్-ఇన్-చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు మాట్లాడుతూ.. స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో జరిగే భవిష్యత్ కార్యక్రమాలకు 'మా గల్ఫ్ న్యూస్' సహకారం అందిస్తుందని తెలిపారు.
_1686036265.jpg )
ఈ సందర్భంగా రాష్ట్ర సాధనకై వివిధ దేశాలలో కృషి చేసిన ప్రవాసీ సంఘాలకు , ఎన్నారైలకు శుభాకాంక్షలు తెలియచేసారు సామాజిక సేవకుడు గుండెల్లి నర్సింహులు.
తెలంగాణ చారిత్రక వైభవాన్ని, ఉద్యమ శైలిని తలపించే మాదిరిగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమలను ప్రదర్శించిన చిన్నారులకు, మహిళలకు , కళాకారులకు నిర్వాహకులు ప్రశంస పత్రాలను అందించారు.
_1686036247.jpg )
_1686036275.jpg )
_1686036284.jpg )
ఈ కార్యక్రమంలో శ్యామ్ తిరుమలశెట్టి, రవి కుమార్ సింగిరి, ఖాజా అబ్దుల్ ముతాలిబ్ , వాసు, భీం శంకర్, మల్లేష్ కోరేపు, సురేష్ గంధం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







