హత్య చేసి పారిపోయిన వ్యక్తిని 6 గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసులు
- June 06, 2023
యూఏఈ : హత్య జరిగిన ఆరు గంటల్లో హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు అజ్మాన్ జనరల్ కమాండ్ ఆఫ్ పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన వ్యక్తిని ఆసియన్ జాతీయుడిగా గుర్తించినట్టు తెలిపారు. తప్పించుకునే ప్రయత్నంలో అల్ కరామా ప్రాంతంలో ఉండగా నిందితుడిని పట్టుకున్నట్లు అజ్మాన్ పోలీస్‌లోని ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కెప్టెన్ అహ్మద్ సయీద్ అల్-నుయిమి తెలిపారు. అజ్మాన్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కార్మికుల వసతి గృహంలోని గది నుండి దుర్వాసన వస్తోందని ఆపరేషన్ గదికి డిస్ట్రెస్ కాల్ వచ్చిందని చెప్పారు. అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వ్యక్తిని 60 ఏళ్ల ఆసియా ప్రవాసుడిగా గుర్తించారు. సాక్షుల కథనం ప్రకారం హతుడితో నివసించిన అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఎమిరేట్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అరెస్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అజ్మాన్ పోలీసులు అల్ కరామా ప్రాంతంలో అనుమానితుడిని గుర్తించి అరెస్ట్ చేసారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తనకు, బాధితుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఆయన వెల్లడించారు. దుండగుడు బాధితుడిని కత్తితో పొడిచి చంపడానికి ముందు చెక్క వస్తువుతో దాడి చేసినట్లు అంగీకరించాడు. ఆర్థిక వివాదం కారణంగా గొడవ జరిగిందని గుర్తించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







