అరేబియా సముద్రంలో తుఫాన్.. యూఏఈపై ప్రభావం ఉంటుందా?
- June 07, 2023యూఏఈ: అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఉష్ణమండల(ట్రోపికల్ ) తుఫాను యూఏఈపై ఎలాంటి ప్రభావం చూపదని అధికార యంత్రాంగం తెలిపింది. వచ్చే వారం చివరిలో అరేబియా సముద్రానికి దక్షిణాన ఏర్పడే తుఫాన్ ప్రభావం ఉండదని జాతీయ వాతావరణ కేంద్రం ధృవీకరించింది.ఇది అరేబియా సముద్రం దక్షిణాన 11.9 ఉత్తర అక్షాంశం మరియు 66.00 రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్న ఉష్ణమండల అల్పపీడనంపై NCM ఒక ప్రకటన విడుదల చేసింది. తుఫాన్ సమయంలో గాలుల వేగం గంటకు 60 నుండి 90 కి.మీ వరకు ఉంటుందని NCM వివరించింది. "ప్రాంతీయ హరికేన్ పర్యవేక్షణ కేంద్రం జారీ చేసిన నివేదికల ద్వారా.. తుఫాన్ మరింత తీవ్రమవుతుంది. రాబోయే 48 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారుతుంది. దాని మార్గం అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా ఉంటుంది. ఇక్కడ గాలి వేగం గంటకు 90-120 కిమీ వేగంతో ఉంటుంది. ఉష్ణమండల తుఫాను వేగం గంటకు 12 కిమీ కదులుతుంది.”అని ఎంసిఎ వెల్లండించింది.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం