ఇండియాలో 50 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!

- June 07, 2023 , by Maagulf
ఇండియాలో 50 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!

యూఏఈ: భారతదేశంలో  విమాన ఛార్జీలు 50% పైగా పెరిగాయి. భారతదేశంలో దేశీయంగా ప్రయాణించాలని యోచిస్తున్న యూఏఈ  నివాసితులు దేశీయ విమానాల కోసం అధిక విమాన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చేబుతున్నారు. భారతదేశంలో  ప్రయాణించడానికి విమాన ఛార్జీలు కొన్ని నగరాల మధ్య దాదాపు 50 శాతం పెరిగాయని రీగల్ టూర్స్ వరల్డ్‌వైడ్‌లో ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ కార్యకలాపాల సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురత్వాలాప్పిల్ తెలిపారు. ప్లూటో ట్రావెల్స్‌లో మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని కూడా భారత్లో  దేశీయంగా  ప్రయాణించే నివాసితులు “విమాన ఛార్జీలు పెరిగినందున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది” అని ధృవీకరించారు.విమాన ఛార్జీలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని  “వేసవి సెలవుల కోసం GCC దేశాల నుండి వేలాది మంది ప్రజలు భారతదేశానికి ప్రయాణిస్తున్నారు.  వారిలో చాలా మంది బంధువులను కలవడానికి లేదా పర్యాటకం కోసం వివిధ నగరాలకు వెళతారు. దీని కారణంగా  భారీ డిమాండ్‌ ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి.' అని ఐదాసాని అన్నారు. ఇదే సమయంలో పెరిగిన ఇంధన ధరలు మరియు గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ మూతపడటం వంటివి విమాన ఛార్జీల పెరుగుదలకు దోహదపడ్డాయని మార్కెట్  నిపుణులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com