అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- May 02, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాదులో కేసు నమోదైంది. కాసేపటి క్రితం ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సీపీఎస్‌కు తరలించారు. కాగా రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్‌ఫేక్’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్‌లో కోరింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







