బ్యాచిలర్ల నివాసాలకు విద్యుత్ నిలిపివేత
- June 07, 2023కువైట్ : ఖైతాన్‌లోని బ్యాచిలర్ నివాసాలకు విద్యుత్‌ను డిస్కనెక్ట్ చేయనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ తెలిపింది. ప్రైవేట్ మరియు మోడల్ రెసిడెన్షియల్ ఏరియాలలో 'బ్యాచిలర్స్' హౌసింగ్ అనేది సమస్యగా మారిందని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ సౌద్ అల్-దబ్బౌస్ తెలిపారు. కుటుంబ నివాస ప్రాంతాలలో నివసించే బ్యాచిలర్లపై తమ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. విద్యుత్తు నిలిచిపోయే వ్యక్తులు తమ ఇళ్లను ఖాళీ చేయమని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా వాటిని పాటించలేదని మున్సిపాలిటీ తెలిపింది. నివేదిక ప్రకారం, మున్సిపాలిటీ 1,150కి పైగా ఇళ్లను వివిధ పరిసర ప్రాంతాలలో బ్యాచిలర్స్ కోసం వసతిగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం