బహ్రెయిన్‌లో 5G డౌన్‌లోడ్ వేగం 3.2 Gbps

- June 07, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో 5G డౌన్‌లోడ్ వేగం 3.2 Gbps

బహ్రెయిన్ : టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) కింగ్‌డమ్‌లోని మొబైల్ నెట్‌వర్క్‌ల సేవల నాణ్యత (QoS)పై 2022 నివేదికను విడుదల చేసింది. ఈ సమగ్ర ఆడిట్ బహ్రెయిన్ మొబైల్ నెట్‌వర్క్ పనితీరు మరియు వినియోగదారు అనుభవాన్ని మొబైల్ కవరేజ్, సేవల నాణ్యత మరియు బిల్లింగ్ అనే మూడు ప్రధాన రంగాల ఆధారంగా ఖచ్చితమైన అంచనాను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.  నివేదిక ప్రకారం.. బహ్రెయిన్‌లో 5G డౌన్‌లోడ్ వేగం 3.2 Gbps గరిష్ట స్థాయికి చేరుకుంది. 4G నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ వేగం 2020 నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది, 2020లో 85 Mbps నుండి 2022లో 266 Mbpsకి పెరిగిందని TRA జనరల్ డైరెక్టర్ ఫిలిప్ మార్నిక్ అన్నారు. పెరిగిన డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగం సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ పనితీరు, వెబ్‌పేజీ బ్రౌజింగ్ వంటి వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగు పరుస్తుందన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com