హనుమాయమ్మ హత్య కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు: ఏపీ డీజీపీ

- June 07, 2023 , by Maagulf
హనుమాయమ్మ హత్య కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు: ఏపీ డీజీపీ

అమరావతి: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న హనుమాయమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హతమార్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హనుమాయమ్మ హత్య కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీకి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. హనుమాయమ్మను స్థానిక వైసిపి నాయకుడు సవలం కొండల్‌రావు ట్రాక్టరుతో ఢకొీట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'నీ భర్త టిడిపిలో ఉన్నాడు. ఆ పార్టీ ఎమ్మెల్యే వెంట తిరుగుతున్నాడు. నువ్వేమో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నావు. మీ ఇద్దరిలో ఎవరో ఒకర్ని చంపే వరకు నేను నిద్రపోను'.. అని రెండు రోజుల కిందట వైసిపి నాయకుడు కొండలరావు హెచ్చరించాడని, ఆయనే ఇంటి వద్ద ఉన్న హనుమాయమ్మ (50)ను ట్రాక్టర్‌తో ఢకొీట్టి హతమార్చాడని మృతురాలి భర్త సవలం సుధాకర్‌, కుమార్తె మాధురి ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com