రూ.500 నోట్ల పై రిజర్వు బ్యాంక్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
- June 08, 2023
ముంబై: ఐదు వందల రూపాయల నోటుపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన లేదని, అలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోట్లను చెలామణి నుంచి రద్దు చేయడం లేదా 1000 రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడం గురించి ఆలోచించడం లేదని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.2024 ఆర్థిక సంవత్సరం కోసం రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరించిన తర్వాత దాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు.వడ్డీ రేట్లను యథాతంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం గృహరుణాలు తీసుకునేవారికి అనుకూలమని చెబుతున్నారు. ప్రస్థుతం వడ్డీరేట్లు బ్యాంకుల్లో సింగిల్ డిజిట్లలోనే కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







