సౌదీ విదేశాంగ మంత్రితో యూఎస్ సెక్రెటరీ భేటీ

- June 08, 2023 , by Maagulf
సౌదీ విదేశాంగ మంత్రితో యూఎస్ సెక్రెటరీ భేటీ

రియాద్: యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రియాద్‌లో బ్లింకెన్ రాజ్య పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తో  సమావేశమయ్యారు. రియాద్‌లోని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) జనరల్ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయంలో జిసిసి మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇద్దరు అగ్ర దౌత్యవేత్తలు.. సౌదీ అరేబియా, యుఎస్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. అదే సమయంలో ప్రాంతీయ,  అంతర్జాతీయ పరిణామాలు.. ఈ విషయంలో చేసిన ప్రయత్నాలపై వారు చర్చించారు. జిసిసి-యుఎస్ సమావేశంలో లేవనెత్తిన అత్యంత ముఖ్యమైన అంశాలు,  వివిధ రంగాలలో జిసిసి-యుఎస్ సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై కూడా ఇరుపక్షాలు చర్చించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com