అప్పుడు కైరా.. ఇప్పుడు మృణాల్ ఠాకూర్.!

- June 09, 2023 , by Maagulf
అప్పుడు కైరా.. ఇప్పుడు మృణాల్ ఠాకూర్.!

తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమా చేసి బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది. అందుకు కారణం ఆమె అక్కడ నటించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీసే.
ఈ సిరీస్‌లో కైరా అద్వానీ పండించిన అడల్ట్ ఎక్స్‌ప్రెషన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఆ సంచలనమే ఆమెను బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ని చేసేసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయింది కైరా అద్వానీ.
ఇప్పుడు అదే ‘లస్ట్ స్టోరీస్’కి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌లో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కైరా అద్వానీలాగే తెలుగులో సినిమా చేసి, ఈ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ కొట్టేసింది మృణాల్ ఠాకూర్.
ఒకవేళ కైరా అద్వానీలాగే లక్కు కలిసొచ్చిందంటే, ‘లస్ట్ స్టోరీస్ 2’తో మృణాల్ దశ తిరిగిపోతుందంటే. అన్నట్లు ఈ సిరీస్‌లో మొదటి పార్ట్‌కి మించిన హాట్‌నెస్ వుండబోతోందట. మొదటి పార్ట్‌ని మించి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.
అన్నట్లు, సీనియర్ బాలీవుడ్ భామ కాజోల్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సిరీస్‌లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com