Dh295కే విమాన ప్రయాణం..తగ్గింపు ఆఫర్లు ప్రకటించిన ఎతిహాద్
- June 10, 2023
యూఏఈ: వేసవి కాలంలో ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఎతిహాద్ ఎయిర్వేస్ తగ్గింపు ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 9 నుండి 15 వరకు తమ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులందరూ జూలై 3, సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించడానికి తగ్గింపు ధరలను పొందవచ్చని ఎతిహాద్ ఎయిర్వేస్ చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ అరిక్ దే తెలిపారు.
ఎకానమీ క్లాస్ ఛార్జీలు మస్కట్‌కి Dh295 నుండి..బిజినెస్ క్లాస్ ఛార్జీలు Dh995 నుండి ప్రారంభమవుతాయి. రుచికరమైన టర్కిష్ వంటకాలను ఆస్వాదించడానికి.. విలాసవంతమైన ప్యాలెస్‌లు, అందమైన వాస్తుశిల్పంతో ఒట్టోమన్ శకం గురించి తెలుసుకునేందుకు ప్రయాణీకులు ఇస్తాంబుల్ని ఎకానమీలో Dh895 నుండి సందర్శించవచ్చు. Dh2,795తో పారిస్‌కు వెళ్లవచ్చు. ఎకానమీ క్లాస్‌లో 2,495 దిర్హామ్‌లతో మాంచెస్టర్ని సందర్శించవచ్చు. మ్యూనిచ్‌కి ఎకానమీ క్లాస్‌లో 2,695 దిర్హామ్‌లు.. బిజినెస్ క్లాస్‌లో 13,995 దిర్హామ్‌లతో చేరుకోవచ్చు.
జ్యూరిచ్‌లోని పర్యాటక ప్రదేశాలను ఎకానమీలో Dh2,395, బిజినెస్ క్లాస్ లో Dh14,995 చెల్లించే ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఎకానమీ క్లాస్‌లో 2,995 దిర్హామ్‌లు, బిజినెస్ క్లాస్‌లో 14,995 ధరలతో పర్యాటకులు ఆమ్‌స్టర్‌డ్యామ్‌ని సందర్శించవచ్చు. బిజినెస్ క్లాస్‌లో ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధరలు Dh19,995 చెల్లించి చికాగోలో పర్యటించవచ్చు. తగ్గింపు ధరలతో పాటు, ఎతిహాద్ ఎయిర్వేస్ నుండి అవార్డు గెలుచుకున్న లాయల్టీ ప్రోగ్రామ్ అయిన ఎతిహాద్ గెస్ట్ సభ్యులు http://Booking.comతో హోటల్లను బుక్ చేసేటప్పుడు 3 - 6 మైళ్ల మధ్య Avis కార్ రైడ్లను ఉచితంగా పొందవచ్చు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









