జన్మభూమికి సేవ చేసిన నిజామాబాద్ జిల్లా వాసి
- June 22, 2015
కృషితో నాస్తి దుర్బిక్షం అని మరో మారు నిరుపించాడు నిజామాబాద్ జిల్లా వాసి పయ్యావుల శ్రీనివాస్ గారు తన స్వగ్రామం: మండలం: సదాశివనగర్ గ్రామం : వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానకి చెందిన పయ్యావుల శ్రీనివాస్ గారు తన స్వగ్రామాన్ని విడిచి గత 13 సంవత్సరాల క్రితం 2002 లో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు.అక్కడ అతను ఒక కంపెని లో హెల్పర్ గా పని చేస్తూ తోటి వారి కష్టసుఖాలలో పాలుపంచుకునేవాడు అలా అతని మదిలో ఒక ఆలొచన బావం కలిగింది.తన దృడమైన సంకల్పంతో ఒక చిన్న కంపెనీని స్థాపించారు.తన తోటివారికి తన కంపెని లో ఉద్యోగం కల్పించి వారికి ఆసరాగ నిలిచారు.తన కుటుంబ సమెతంగా వారు లో స్థిర పడ్డారు అలా అంచెలంచెలుగా ఎదుగుతు తోటివారికి సహయపడుతున్నారు సుమారు 400కు పైగా కార్మికులకు ఉపాది కల్పిస్తూన్నారు.అతను ఎంత ఎదిగిన తన స్వ గ్రామాన్ని ఎప్పుడూ కూడా మరవలేదు.తన గ్రామా ప్రజల కష్ట సుఖాలను తెలుసు కుంటూ వారికి తన వంతు సహాయసహకారాలు అందజేస్తున్నారు.తను ఇంత ఎదగడానికి తన తల్లిదండ్రుల,మరియు కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల ప్రోత్సహం తో ఎదిగానని వారికి ఎప్పుడు ఋణపడి ఉంటానని చెప్పారు.అలాగే తన ఇష్ట దైవమైన ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండడంవల్ల ఈస్థాయికి చెరుకున్నాని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాస్థానంలో తన యొక్క చిన్నకానుకగా ఒక మంచినీటి ట్యాంక్ మరియు ఒక లడ్డూ కౌంటర్ ఏర్పాటుచేశారు.మరెన్నో స్వచ్ఛంద స్వంస్థలకు విరాలాలు అందజేస్తున్నారు.బహ్రెయిన్ న్యూస్ రిపోటర్ వాసు గారితో తన భావాలను పంచుకున్నారు.బహ్రెయిన్ న్యూస్ ప్లస్...ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకి వెళ్ళాలి జన్మభూమికి ఎంతో కొంత సహాయసహకారాలు అందించాలి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







