సీనియర్ సిటిజన్ ను బురిడికొట్టించిన స్కామర్స్.. ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష
- June 11, 2023
బహ్రెయిన్: మోసపూరిత టెక్స్ట్ మెసేజ్ స్కామ్ ద్వారా 60 ఏళ్ల వ్యక్తిని BD500 మోసం చేసినందుకు దోషిగా తేలిన ఇద్దరు ఆసియా వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు వారికి ఒక్కొక్కరికి BD5,000 జరిమానా విధించింది. వారి జైలు శిక్ష పూర్తయిన తర్వాత, వారు దేశం నుండి బహిష్కరించాలని తీర్పులో పేర్కొంది. బాధితుడికి మోసపూరిత లింక్‌తో కూడిన ఫోన్ సందేశం అందడంతో, అతని బ్యాంక్ కార్డ్ వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని అందించాడు.దీంతో బాధితుడికి తెలియకుండా అతని బ్యాంక్ ఖాతా నుండి BD500ని అనధికారికంగా దొంగిలించారు. అయితే, తాను స్కామ్‌కు గురయ్యానని తెలుసుకున్న వ్యక్తి వెంటనే తన నిధులను రికవరీ చేయాలని కోరుతూ యాంటీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు డబ్బును కాజేసిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారు మోసపూరిత కార్యకలాపాల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ వైర్ ఫ్రాడ్, దొంగతనం, మనీ లాండరింగ్ వంటి అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







