ఉమ్ అల్ క్వైన్‌లోని టెక్స్టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
- June 11, 2023
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో శనివారం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఉమ్ అల్ థౌబ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని టెక్స్టైల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఉమ్ అల్ క్వైన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







