ట్రక్కుని ఢీకొట్టి.. మంటల్లో చిక్కుకుని డ్రైవర్ మృతి
- June 12, 2023
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ట్రక్కును ఢీకొట్టి మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకొని కారు డ్రైవర్ మృతి చెందాడు. ట్రాఫిక్ రిజిస్ట్రేషన్ హెడ్, బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ కెప్టెన్ అహ్మద్ ఖల్ఫాన్ బిన్ లాహెజ్ మాట్లాడుతూ.. వాహనదారుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో అక్రమంగా నిష్క్రమించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయని, అందులో చిక్కుకొని డ్రైవర్ మరణించాడని పేర్కొన్నారు. డ్రైవర్ వెంటనే మృతి చెందగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. కాలిపోయిన వాహనం నంబర్ ప్లేట్ నుండి పోలీసులకు కేవలం రెండు అంకెలు మాత్రమే లభించాయి.దీంతో మృతుడి గుర్తింపును నిర్ధారించడం కష్టంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలో లభించిన చిన్న కాగితం ముక్క ఆధారంగా వాహనం యజమానిని ట్రేస్ చేసి సంప్రదించగా, అతను తన కారును స్నేహితుడికి ఇచ్చినట్టుగా చెప్పాడు. ఈ సమాచారం ఆధారంగా మృతుడిని గుర్తించినట్లు బిన్ లాహెజ్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







